విజయనగరం జిల్లాకు చెందిన కోటేశ్వరరావు కుప్పంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ బదిలీపై రెండు నెలల కిందటే పాకాల మండలం మొగరాల పంచాయతీ కృష్ణాపురం ప్రాథమిక పాఠశాలకు వచ్చారు. విద్యార్థులను చితకబాదటం, బూతులు మాట్లాడటం నిత్యకృత్యంగా పెట్టుకున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. గురువారం మధ్యాహ్నం పాఠశాలలోనే మద్యం సీసా ముందు పెట్టుకొని బిరియానీతో దర్శనమిచ్చారు. ఉపాధ్యాయుడు ప్రవర్తన పై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు అతని పై అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దీంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది.