తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నటుడు కమల్ హాసన్ దిగుతున్న సంగతి తెలిసిందే. మక్కల్ నీది మయ్యమ్ పార్టీ పెట్టిన కమల్ తన అభ్యర్థులను కూడా ప్రకటించారు. తాను స్వయంగా కోయంబత్తూర్ నుంచి పోటీలో నిలిచారు. తమిళనాడులో రాజకీయాలు, సినీ రంగానికి ప్రత్యేక అనుబంధం ఉంది. వెండితెరను శాసించి తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఎంజీఆర్, కరుణానిధి, జయలలితలు తమదైన ముద్రవేశారు. ఇప్పుడు నీతివంతమైన రాజకీయాలే ఎజెండా అంటూ కమల్ హాసన్ కూడా పోటీకి రెడీ అయ్యారు.