హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో సుప్రజా ఆస్పత్రి లో, కరోనాతో ప్రాణాలు కోల్పోయిన మృతదేహాన్ని ,మూడు రోజుల నుంచి ఆస్పత్రి సెల్లార్ లోనే పెట్టి, మృతదేహం బంధువులకు ఆరు లక్షల రూపాయల కడితేనే డెడ్ బాడీ నీ ఇస్తామంటూ చెబుతోంది సుప్రజా ఆస్పత్రి యాజమాన్యం. ఏప్రిల్ 17వ తేదీన కరోనా సోకి డెవిల్ అనే వ్యక్తి సుప్రజా ఆస్పత్రిలో చేరాడు. ఇక అతనికి రోగ నిరోధక శక్తి పూర్తిగా పడిపోవడంతో చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది .ఇక ఏప్రిల్ 25వ తేదీన డెవిల్ ప్రాణాలను కోల్పోయాడు..డెవిల్ చనిపోయి మూడు రోజులు అవుతున్నప్పటికీ ,అతనికి సీరియస్ గా ఉందని చెబుతూనే ,వెంటనే ఆరు లక్షలు కడితేనే అతని ఆరోగ్యం నయం చేస్తామంటూ ఆటలు ఆడింది ఆస్పత్రి యాజమాన్యం. అయితే డెవిల్ చనిపోయాడు అన్న విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు, తీవ్ర ఆగ్రహానికి గురి అయి ,ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు