ముఖ్యంగా భూ రసాయన శాస్త్రవేత్త తన కెరియర్ లో ఎక్కువ భాగం ప్రపంచంలోని కొన్ని లోతైన గనుల చుట్టూ తిరుగుతూ, మిలియన్ల సంవత్సరాల నాటి కిందటి నీటిని కనుగొని వాటిని వెలికి తీయడం జరిగింది.. ఇక ఇదే పనిలో షేర్వుడ్ లోల్లార్ కూడా 1992లో టిమ్మిన్స్క్ ఉత్తరాన గ్లెన్కోర్ యాజమాన్యంలోని కిడ్ గ్రీక్ గనిని సందర్శించారు. ఇక తిరిగి దాదాపు 17 సంవత్సరాల తర్వాత ఆమె 2.4 కిలోమీటర్ల భూగర్భంలో కి వెళ్ళిన యాత్రలో, ఆమె బృందం చివరకు రికార్డు సృష్టించిన ఉప్పునీటిని వెలికితీసింది.. ఈ నీరు నాలుగు సంవత్సరాల తర్వాత తిరిగి లెక్కలేనన్ని పరీక్షలు చేసి,బిలియన్ సంవత్సరాల కంటే ముందే ఈ నీరు ఇక్కడ ఉన్నట్టు ఆ బృందం గుర్తించింది