రక్త నిల్వలు పుట్టినిల్లు అనగానే అందరికీ గుర్తొచ్చేది రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్. ఇది అంతర్జాతీయ రెడ్ క్రాస్ మానవతా ఉద్యమం. ఈ సంస్థ లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9.7 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. వీరు మానవతా వాదాన్ని, మానవుల జీవితాలను, వారి ఆరోగ్యాన్ని కాపాడటానికి ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు అనునిత్యం పోరాడుతూనే ఉంటారు . అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థలు అనేక రకాల సమస్యలతో బాధపడుతున్న పేద ప్రజలను ఆదుకుంటున్నాయి . అంతేకాకుండా ఈ పేద ప్రజలను ఆదుకున్న వారికి, వారి గౌరవార్థం రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. ఇందులో జాతి, కుల, మత, వర్గ,వర్ణ, వయో బేధాలు లేకుండా సత్సంకల్పంతో అందరూ పని చేస్తూ ఉంటారు.