2020-2021 ఆర్థిక సంవత్సరంలో పది ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన 2118 బ్రాంచీలు క్లోజ్ అయినట్లు తెలిపింది. అయితే ఈ బ్యాంకు బ్రాంచీలు మొత్తంగా క్లోజ్ కావచ్చు. లేదంటే వేరే బ్యాంకుల బ్రాంచులలోకి విలీనం కావచ్చు. అయితే ఇప్పటికీ ఈ అంశంపై స్పష్టత లేదు.బ్యాంక్ ఆఫ్ బరోడా కు చెంది 1283 బ్రాంచ్ లు ఉన్నాయి. అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) 332 బ్రాంచ్ లను కలిగి ఉన్నాయి. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) 169 బ్రాంచ్ లు కలిగి ఉన్నాయి. అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో 124 బ్రాంచ్ లు ఉన్నాయి. కెనరా బ్యాంక్ 107, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 53, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 43, ఇండియన్ బ్యాంక్ 5 బ్రాంచ్ లను కలిగి ఉన్నాయి.