ఊహించని విధంగా కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా తీవ్ర సంక్షోభనికి దారితీసింది. ఈ విపత్తు నుండి ఎప్పుడు బయటపడతామో కూడా తెలియని పరిస్థితి ఉండగా.. కేంద్రం మరో పిడుగు లాంటి వార్త చెప్పింది. మరోసారి కోవిడ్ ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని నీతి అయోగ్ సభ్యుడు వి కె పాల్ హెచ్చరించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ మాట చెప్పారు. అంతే కాకుండా కఠిన ఆంక్షలు విధించి, ప్రజలందరూ నిబంధనలను కచ్చితంగా పాటించాలని చెప్పారు.