కుటుంబం అంటే సంతోషం, బాధ ,దుఃఖం ,ప్రేమ, అనుబంధాలు , ఆత్మీయతలు ఇలా ఎన్నో ప్రేమానురాగాలు అన్ని కలిసి ఒకే చోట ఉండేదే కుటుంబం..విభిన్న రకాల మనస్తత్వాలు, అభిప్రాయాలు ఉన్న వ్యక్తులను ఒకే చోట అనుబంధంగా మార్చేది కుటుంబం. మన భారతీయ కుటుంబం. పిల్లల సంతోషాలను తమ సంతోషాలు గా భావించే తల్లిదండ్రులు, తల్లిదండ్రుల కలలను సైతం నెరవేర్చాలని తపనపడే పిల్లలు ఇలా ఎల్లప్పుడూ ప్రేమ ఆత్మీయతతో కలిసుండేదే కుటుంబం.. నిజానికి దీని చరిత్ర ఏమిటంటే , 1983లో ఐక్యరాజ్యసమితి చూపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుటుంబాల వైపు మళ్ళింది. ఇలా ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, సోషల్ డెవలప్మెంట్ కమిషన్ అప్పటి సెక్యూరిటీ జనరల్ కుటుంబాల సమస్యలు వాటి అవసరాల గురించి మరింత అవగాహన పెంచుకోవాలి అనుకుంది.. 29 1985న ఆమోదించిన తీర్మానంలో, కౌన్సిల్ సిఫారస్ పై అసెంబ్లీ అభివృద్ధి ప్రక్రియలో కుటుంబాలు అనే అంశాన్ని కూడా చేర్చారు. అంతేకాకుండా 1989 డిసెంబర్ లో ప్రతి సంవత్సరం మే 15వ తేదీన అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం జరుపుకోవాలని కూడా ప్రకటించింది ఐక్యరాజ్య సమితి.