అమెరికాలోని బోస్టన్‌లో ఫ్రాంక్లిన్ జూ పార్క్‌లో ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. మూడు నెలల పసిబిడ్డను తీసుకొని ఓ జంట ఈ జూకు వెళ్లింది. అదే సమయంలో ఓ గ్లాస్ ఎగ్జిబిషన్లో ఉన్న గొరిల్లా, మహిళ ఎత్తుకున్న ఆ చిన్నపిల్లాడిని చూసింది. వెంటనే ఆ గ్లాస్ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చిన గొరిల్లా.. ఆ పిల్లాడిని చూస్తూ ఉండిపోయింది. ఇది చూసిన ఆ మహిళ తన బిడ్డను తీసుకొని ఆ గ్లాస్ వద్దకు వెళ్లింది. వెంటనే ఆ గొరిల్లా,ఆ గ్లాస్‌పై చెయ్యి పెట్టి,పసిబిడ్డకు ముద్దులిస్తూ, చిన్నారి తలపై చెయ్యి పెట్టడానికి ప్రయత్నించింది. కానీ అక్కడ గ్లాస్ అడ్డుపడడంతో ఆ గొరిల్లా నిరాశచెందింది. ఆ చిన్నారిని తాకాలని ఎంతో తహలాడిపోయింది ఆ గొరిల్లా తల్లి. కానీ చివరకు నిరాశే మిగిలింది..ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.