ఈ రక్త పోటు ఉన్నప్పుడు ధమనులలో ఉన్న ఒత్తిడిని కొలుస్తారు.. ఈ ఒత్తిడిని పీడనం అని కూడా అంటారు. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల రక్తపోటు 120/80 ఉంటుంది. ఈ విలువ 135/85 దాటితే, ఆ వ్యక్తి అధిక రక్తపోటుతో బాధపడుతున్నాడని అర్థం. అయితే ప్రపంచవ్యాప్తంగా అకాలమరణానికి అధిక రక్తపోటు ప్రధాన కారణం అవుతోంది. దీనికి స్పష్టమైన ఎలాంటి లక్షణాలు లేవు. అనారోగ్యకరమైన జీవనశైలి అధిక రక్తపోటుకు దారి తీస్తుంది. సాధారణంగా ఎక్కువ ఉప్పు తినడం, అధిక బరువును కలిగి ఉండడం , తగినంత వ్యాయామం చేయకపోవడం, ఒక విషయాన్ని పదే పదే ఆలోచించడం, అలాగే పొగాకు వాడటం వంటి వాటి వల్ల కూడా రక్తపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ.ముఖ్యంగా రక్తపోటు లక్షణాలు గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. ప్రజలందరూ రక్తపోటును ఎప్పటికప్పుడు డాక్టర్ వద్ద చెకప్ చేయించుకోవడం ఉత్తమం. ఇంకా అధిక రక్తపోటుకు సంబంధించిన ముందస్తు నివారణ పద్ధతులు తెలుసుకోవడం వల్ల అకాల మరణాల నుండి తప్పించుకోవచ్చు..