రేపు అనగా మే 26వ తేదీన బుధవారం చంద్ర గ్రహణాన్ని పాక్షిక దశ భారతదేశంలో మధ్యాహ్నం 3:15 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 6:23 గంటలకు ముగుస్తుంది. మొత్తం దశ సాయంత్రం 4:39 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 4:58 గంటలకు చంద్రగ్రహణం ముగుస్తుంది. ఇంకా ఐఎండీ తెలిపిన ప్రకారం పోర్ట్ బ్లెయిర్ నుండి గ్రహణం సాయంత్రం 5:38 గంటల నుండి చూడవచ్చు .అలాగే 45 నిమిషాల పాటు చూసే అవకాశం ఉంటుంది. బెంగాల్లో పూరి అలాగే మల్డా లో సాయంత్రం 6:21 గంటలకు చంద్ర గ్రహణాన్ని చూడవచ్చు కానీ రెండు నిమిషాలు మాత్రమే కుదురుతుంది.ఇక చంద్రగ్రహణం నుండి చంద్రుడు తూర్పు హోరిజోన్ కంటే చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజలు భారతదేశం నుండి ఈ గ్రహం యొక్క ప్రారంభాన్ని చూడలేరు. అయితే తూర్పు భారతదేశంలో నివసించే ప్రజలు పాక్షిక దశ చంద్రగ్రహణం మాత్రమే చూడగలుగుతారు.