కేంద్ర ప్రభుత్వం మూడు నెలల అవకాశం ఇచ్చినప్పటికీ , దేశీయ సోషల్ మీడియా సంస్థ "కూ" మినహా ,ఏ కంపెనీ కూడా భారత్ లో ప్రత్యేక అధికారులను నియమించలేదు. ఇక అమెరికాలో తమ ప్రధాన కార్యాలయాల నుంచి సూచనల కోసం ఎదురుచూస్తున్నామని, మరో ఆరు నెలల గడువు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాయి మిగతా సోషల్ మీడియా వెబ్ సైట్లు. ఈ విషయంపై గడువు ముగియడంతో ఫేస్బుక్ ప్రతినిధి ఒకరు స్పందించారు. మేము కూడా భారత ఐటీ నిబంధనలకు అనుగుణంగా పని చేస్తామని, పలు సమస్యలపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని తెలిపారు.. కానీ వాట్సాప్ మాత్రం కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది.