అమెజాన్ ప్రైమ్ లో ఓటీటీ ద్వారా విడుదలయ్యే కొత్త సినిమాలను కూడా చూడవచ్చు. అయితే ఇప్పుడు అమెజాన్ వీడియోస్ స్ట్రీమింగ్ సర్వీసును మరింత పటిష్టం చేయనుంది. అది ఎలా అంటే జేమ్స్ బాండ్ సినిమాల నిర్మాణ దిగ్గజం ఎంజీఎం ను ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ కొనుగోలు చేయనుంది. ఇందుకోసం భారీ ఎత్తున డబ్బులు ఖర్చు ( 8.45 బిలియన్ డాలర్లు) చేస్తోంది. దీంతో తమ వీడియోస్ స్ట్రీమింగ్ సర్వీసులను కూడా మరింత పటిష్టం చేసుకోవాలని యోచిస్తోంది