కేంద్ర ప్రభుత్వం విధించిన చట్టాలను 26-5-2021 (బుధవారం) నుంచి అమల్లోకి తీసుకువచ్చింది కేంద్రం. ఈ చట్టాలను గౌరవిస్తామని, ఏ దేశంలో ఎలాంటి కార్యకలాపాలు సాగించినా , అక్కడి స్థానిక చట్టాలను అనుగుణంగా పని చేస్తామని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. భారతదేశంలో చాలా స్వేచ్ఛాయుత ఇంటర్నెట్ సుదీర్ఘకాలంగా వస్తున్న సంప్రదాయం అని పేర్కొన్నాడు. ప్రపంచంలో ఏ నియంత్రణ వ్యవస్థతో అయినా కలిసి పని చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. అలాంటి చట్టాలకు మేము పూర్తిగా సహకారం అందిస్తామని కూడా గూగుల్ సీఈవో పేర్కొన్నాడు.