ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్ కరోనా చికిత్స పొందుతూ , కొంచెం సేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. అయితే గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న ఎస్వీ ప్రసాద్, ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. ఇదిలా ఉండగా, ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి కూడా తన ట్విట్టర్ ద్వారా ఎస్వీ ప్రసాద్ మరణానికి సంతాపం తెలిపారు. ఆయన తన ట్విట్టర్ లో.. శ్రీ ఎస్వీ ప్రసాద్ గారి మరణంతో తీవ్ర మనస్థాపం చెందుతున్నాను. ఈయన మరణం ఒక రాజకీయ రంగానికి పెద్ద నష్టం. ఈయన కుటుంబానికి నా హృదయపూర్వక సంతాపం తెలియజేస్తున్నాను. ఇక వీరు ఈ విపత్కర పరిస్థితుల నుండి ఎదుర్కోవడానికి వారికి బలం చేకూరాలని కోరుకుంటున్నాను".. అంటూ చిరంజీవి తెలియజేశారు.