స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సరికొత్త ట్వీట్ చేశారు. ఇక తన ట్వీట్ ద్వారా.. " ఈరోజు పర్యావరణ దినోత్సవం కాబట్టి మన భూమండలాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది. కాలుష్యాన్ని తగ్గించడానికి కోసం ప్రతి ఒక్కరు మొక్కలు నాటండి. మనం ప్రకృతిని ఎంత కాపాడితే, ప్రకృతి మనల్ని అంత కాపాడుతుంది.నేను ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర చొరవ తీసుకొని అడుగుతున్నాను. మీరు మొక్కలు నాటి, ఆ ఫోటోలను నాకు షేర్ చేయండి. వాటిలో కొన్ని ఫోటోలను నేను నా ట్విట్టర్ లో షేర్ చేస్తాను "..అంటూ ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చారు అల్లుఅర్జున్. ఇక అంతే కాకుండా ఇది "కేవలం సెలబ్రిటీలకు మాత్రమే కాదు ప్రతి ఒక్క ప్రేక్షకులను,అభిమానులను అడుగుతున్నాను. ఈ పర్యావరణాన్ని కాపాడాలంటే మొక్కలు నాటడం ఎంతో అవసరం".. అంటూ ఆయన అందరికీ పిలుపునిచ్చారు.