వాట్సాప్ లో పొరపాటున డిలీట్ చేసిన మెసేజ్ లను తిరిగి పొందాలంటే,వెంటనే వాట్సాప్ లో ఏ ఆప్షన్ ని కూడా కదిలించకుండా, వాట్స్అప్ ను అన్ ఇన్స్టాల్ చేయండి. అనంతరం గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి వాట్సాప్ ని ఇన్స్టాల్ చేయండి. ఇప్పుడు వాట్సాప్ లో ప్రొఫైల్ వివరాలు ఇచ్చిన తర్వాత, వాట్సప్ చాట్ బ్యాకప్ ను రీస్టోర్ చేయమంటారా? లేదా? అని అడుగుతుంది. అప్పుడు మీరు బ్యాకప్ అనే బటన్ పై క్లిక్ చేస్తే చాలు, మీరు పొరపాటున డిలీట్ చేసిన చాట్ అంతా మీకు తిరిగి కనిపిస్తుంది. అయితే మీరు తొలగించిన వాట్సాప్ సందేశాలను తిరిగి పొందగలిగినప్పటికీ, ఉచిత ప్రకటనలు మాత్రం భరించాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రకటనలు తొలగించడానికి మాత్రం నెలకు 65 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. ఇక అంతే కాకుండా ఈ ట్రిక్ ద్వారా మీరు కేవలం సందేశాలను మాత్రమే తిరిగి పొందగలుగుతారు ఇక GIF లు, చిత్రాలు, వీడియోలు వంటివి తొలగించబడతాయి