భారత దేశము నా మాతృభూమి.. భారతీయులందరూ నా సహోదరులు.. అంటూ చేసే ప్రతిజ్ఞ రాసింది ఎవరో కాదు శ్రీ పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు. ఆయన రచించిన ప్రతిజ్ఞ భారతీయ భాషల్లోకి అనువాదమై, 1965 జనవరి 26వ తేదీ నుండి పాఠ్య పుస్తకాలలో ప్రచురించబడింది. ఈయనకు తెలియకుండానే వెంకట సుబ్బారావు గారి పేరు భారతదేశమంతటా మారు మ్రోగింది. కానీ ఈయనకు ఈ విషయం తెలియదు. ఇక 1988 ఆగస్టు 13వ తేదీన స్వర్గస్తులయ్యారు. అనంతర కాలంలో పరిశోధకుల, పోరాట కారుల, కృషితో ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి చరిత్రకెక్కారు.