రష్యా శాస్త్రవేత్తలు ఉత్తరాన ఉన్న యకుటియా ప్రాంతంలోని అలజేయ నది నుండి తీసిన మట్టిలో "బడెల్లోయిడ్ రోటిఫైయర్ " అని పిలువబడే అతి చిన్న పురాతన జీవిని కనుగొన్నారు.ఈ జీవిలు ప్రపంచ వ్యాప్తంగా మంచినీటి ఆవాసాలలో నివాసం ఏర్పరుచుకుంటాయి. అంతేకాకుండా తీవ్రమైన చలిని కూడా తట్టుకునే సామర్థ్యం ఈ జీవికి ఉంది. ఇక అలాగే అంతకు ముందు జరిగిన పరిశోధనలో -20 డిగ్రీల సెల్సియస్ వద్ద కూడా భూమిని స్తంభింప చేసినప్పుడు, ఇది ఒక దశాబ్ద కాలం పాటు జీవించింది.భూమికి సుమారు 3.5 మీటర్ల దిగువన తీసుకున్న నమూనాల నుండి దీనిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ జీవి ఏకంగా 24,485 సంవత్సరాల క్రితం నాటిదని అధ్యయనం తెలిపింది.