మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అనంతపురం జిల్లా, యల్లనూరు మండలంలోని బుక్కాపురం గ్రామంలో , బుక్కాపురం నాదెళ్ల యుగంధర్ , ప్రభావతి యుగంధర్ లకు 1967 ఆగస్టు 19వ తేదీన జన్మించారు. సత్య నాదెళ్ల తండ్రి బుక్కాపురం నాదెళ్ల యుగంధర్ 1962 వ బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఈయన ఎన్నో మంచి పనులను చేపట్టి, రాష్ట్రంలో మంచి అధికారిగా గుర్తింపు కూడా తెచ్చుకున్నారు.ఇక ప్రస్తుతం ఫోర్బ్స్ జాబితాలో మరో సారి తెలుగు వెలుగులు కనిపించాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కూడా ఉన్నారు ఈ సంవత్సరం ఫార్చ్యూన్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2019 జాబితాలో ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఈ జాబితాలో మొత్తం 20 మంది పేర్లు ఉండగా,అందులో ముగ్గురు భారతీయ సంతతికి చెందినవారే ఉండటం విశేషం.