పాకిస్థాన్లో చక్కెర రహిత 3 మామిడి పండ్ల రకాలను పండించారు.వాటికి కీట్, గ్లెన్, సోనారో అని నామకరణం కూడా చేశారు. ప్రస్తుతం ఈ చక్కెర రహిత మామిడిపండ్లు పాకిస్థాన్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి..ముఖ్యంగా చౌన్సా, సింద్రీ రకాలలో 12 నుంచి 15 శాతం వరకు చక్కెర శాతం ఉండగా, అక్కడ పండించే కొన్ని రకాల మామిడి పండ్లలో కేవలం 4 నుండి 5 శాతం మాత్రమే చక్కెర స్థాయి కలిగి ఉండడం విశేషం. ముఖ్యంగా కీట్ రకంలో తక్కువగా చక్కెర స్థాయి 4.7 శాతం నమోదైంది. అంతేకాదు పాకిస్తాన్ మార్కెట్లో కిలో 150 రూపాయలు చొప్పున వీటిని అమ్మడం కూడా జరుగుతోంది.