ఎంతో పెద్ద విస్తీర్ణం కలిగి ఉన్న సూర్యుడు, పసుపు నారింజ రంగులో కనిపించే సూర్యుడికి బదులుగా చాలా చిన్న వస్తువు వలె సిల్హౌట్లో కనిపిస్తోందని ఐఎస్ఎస్ వెల్లడించింది. ఇక అంతే కాకుండా ఐఎస్ఎస్ ఏడు వేరు వేరు సమయాలలో సూర్యుని నుంచి తీసుకున్న ఫోటోలను నాసా తో పంచుకుంది. ఇక ఈ ఫోటో లను స్వాధీనం చేసుకున్న నాసా ఒక మిశ్రమ చిత్రాన్ని సృష్టించింది. ఐఎస్ఎస్ భూమి నుంచి 410 కిలోమీటర్ల దూరంలో సెకండ్ కి సుమారు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు అమెరికా అంతరిక్ష సంస్థ తెలిపింది. నాసా తన అధికారిక ట్విట్టర్ ద్వారా షేర్ చేయడంతో ,వెంటనే ఆరు లక్షలకు పైగా లైకులు వచ్చాయి.