తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడు కూడా అలాంటి వీడియోనే తీసి పాపులర్ అవ్వాలనుకున్నాడు. తాను కూడా ఓవర్ నైట్ సెలబ్రెటీ అవ్వాలనుకున్నాడు. అందుకోసం ఆ యువకుడు మరింత ప్రమాదకరంగా బతికి ఉన్న పామును మింగేస్తూ వీడియోలో షేర్ చేశారు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన యువకుడు బ్రతికి ఉన్న పామును కరకరా నమిలి మింగేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సదరు యువకుడు మ్యాన్ వర్సెస్ వైల్డ్ హైదరాబాద్ వర్షన్ అనే పేరుతో బతికి ఉన్న పామును తింటూ ఈ వీడియోను షేర్ చేశాడు.