మన పాటలు ఇక్కడే కాదు విదేశాల్లోనూ ఊపేస్తుంటాయి. ఇక ప్రస్తుతం సోషల్ మీడియా విప్లవంతో మన పాటలు ఖండాలు దాటుతున్నాయి. టిక్ టాక్, ఇన్స్టా గ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో మన పాటలకు వీదేశీయులు పోటీ పడి మరీ డ్యాన్స్ లు చేస్తున్నారు. అప్పట్లో మన తెలుగు పాటలకు ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్ డ్యాన్సులు చేసిన వీడియోలు ఎంత వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాంతో తెలుగు పాటలకు ఎంతో మంది అభిమానులు అయ్యారు. ముఖ్యంగా బుట్ట బొమ్మ..సామజవరగమనా పాటలు నెట్టింట తెగ చక్కర్లు కొట్టాయి.