ఆఫ్గనిస్తాన్ ను తాలిబన్లు ఆక్రమించుకున్న తరవాత దేశాన్ని కాపాడే దిక్కు లేకుండా పోయింది. అమెరికా ఆర్మీ అండగా ఉంటుందనుకుంటే ఆఫ్గనిస్తాన్ ను ఒంటరి చేసి దేశాన్ని వదిలి పోయింది. దాంతో తాలిబన్లు రెచ్చిపోయి దాదాపు ఆఫ్గనిస్తాన్ మొత్తాన్ని ఆక్రమించారు. అయితే ఆఫ్గనిస్తాన్ మొత్తాన్ని ఆక్రమించిన తాలిబన్లకు దేశంలోని పంజ్ షీర్ లోయ మాత్రం ఎప్పుడూ ఒక సవాలుగానే ఉంటుంది. దాంతో తాలిబన్లు పంజ్ షీర్ ను ఆక్రమించేందుకు సిద్దమై యుద్దానికి దిగారు. కానీ పంజ్ షీర్ వీరుల దెబ్బకు తాలిబన్లు అబ్బా అంటున్నారని జాతీయ మీడియా కథనాలను రాసింది.