ప్రస్తుతం తెలంగాణ జానపదం బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా బా పాట యూట్యూబ్ ను షేక్ చేస్తొంది. నెట్టింట ఎక్కడ చూసినా ఈ పాటే దర్శనం ఇస్తుంది. అంతే కాకుండా ఈ పాటకు నెటిజన్ల నుండి కూడా విశేష స్పందన వస్తోంది. ఎంతో మంది ఈ పాటకు రీల్స్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఇన్ స్టాగ్రామ్ లోనే కాకుండా మోజ్ లోనూ ఈ పాటకు ఎక్కువగా వీడియోలు చేస్తున్నారు. ఇక ఈ పాటను యూట్యూబ్ లో రిలీజ్ చేసినప్పటికీ జన్నారం కు చెందిన ఓ పెళ్లి కూతురు పెళ్లి భరత్ లో స్టెప్పులు వేయడంతోనే ఈ పాటకు మరింత ఆదరణ లభించింది. పెళ్లి కూతురు వేసిన డ్యాన్స్ రాత్రికి రాత్రే వైరల్ అవ్వడంతో ఇక ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది.