పారాగ్లైడింగ్ చేయడం అంటే ఎంత ధైర్య వంతులైనా వణికిపోతుంటారు. దానికి కారణం పారా గ్లైడింగ్ చేయడం అంత సులభం కూడా కాదు. ఎంతో ఎత్తు నుండి కొండల పై నుండి ధైర్యంగా కిందకు దూకాలి. పారాచూట్ ఉన్నా కూడా అంత ఎత్తు పై నుండి కొండలపై నుండి దూకాలంటే భయం వేయడం సాధారణమే. అయితే మనుషులే ఎంతో భయపడే పారాగ్లైడింగ్ ను ఓ కుక్క మాత్రం తెగ ఎంజాయ్ చేసింది. కుక్కను పెంచుకున్న యజమాని తన కుక్కతో కలిసి పారాగ్లైండింగ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మూడేళ్ల క్రితం కుక్కను దత్తత తీసుకున్న యజమాని దానిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. కుక్క కూడా అతడితో ఎంతో సరదాగా గడుపుతుంది.