అసలు గ్రహాంతవాసులు ఉన్నారా లేరా..? అనేది ఎవరికీ అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోతుంది. విదేశాల్లో మాత్రం అందుకు భిన్నంగా తమను ఏలియన్స్ ఎత్తుకెళ్లారని పేర్కొంటుంటారు. అందులో ఒకరైన షాన్ జార్జ్ రైడర్ (59). ఈయన పాపులర్ సింగర్, సాంగ్ రైటర్, కవి. స్టార్ సెలబ్రిటీగా పేరొందిన షాన్ ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. అక్కడ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. ఏలియన్స్ తో తనకు ఎంతో అనుబంధం ఉందని.. తనకున్న అనుబంధాన్ని ఫోన్ ద్వారా చూపించాడు. గతంలో ఎప్పుడో 15 ఏండ్ల కిందట ఓ సంఘటన జరిగిందని.. అది ఇంకా గుర్తుందని వివరించాడు. నింగిలోకి ఎగిరే పళ్లాన్ని నేను తొలిసారి చూశానని.. నాతో పాటు మరో అబ్బాయి కూడా ఉన్నాడని వివరించాడు.