పరోక్షంగానూ , ప్రత్యక్షంగానూ మానవుల వలన ఎన్నో ఏనుగులు చనిపోతున్నాయి. కొందరు ఏనుగులు తిరిగే ప్రదేశాలలో హైపవర్ కరెంట్ తీగలు అమర్చి వాటి మరణానికి కారణం అవుతున్నారు. ఇంకొందరు ఏనుగుల దంతాల కొరకు వేటాడి మరి చంపుతున్నారు. అయితే ఇటువంటి వాటిని అడ్డుకుని ఏనుగులను రక్షించేందుకు నడుం బిగించారు ఎస్పీ పాండే. ప్రజల్లో ఏనుగుల ప్రాముఖ్యతను గుర్తించి అవగాహన పెంచి వాటిని రక్షించాలని స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అందుకోసం ఏనుగులు ఎక్కువగా సంచరించే ఐదు కారిడార్లలో ఏనుగులకు మరియు మనుషులకు మధ్య ఘర్షణ వాతావరణాన్ని తగ్గించే దిశగా వర్క్‌షాప్‌లను నిర్వహించడానికి తనవంతు ప్రయత్నం మొదలు పెట్టారు.
43ఏళ్ల ఎస్పీ పాండే ఏనుగుల కోసం చేస్తున్న కృషికి దేశం నలుమూలల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాకుండా వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుటిఐ) పాండేను ఆయన సేవలకు గాను గ్రీన్ కారిడార్ ఛాంపియన్ టైటిల్‌తో సత్కరించి అభినందించింది. ఇది ఎప్పుడూ అంతర్జాలంలో బాగా వైరల్ అవుతోంది. ఈయనను స్ఫూర్తిగా తీసుకుని మరి కొందరు ఇలాంటి మంచి పనులు చేయాలని కోరుకుంటున్నారు.