వైరల్ : ఇమ్రాన్ ఖాన్ పై పేరడీ సాంగ్?
దీంతో అరబిక్ దేశాలు పాకిస్థాన్కు సహాయం చేయకపోగా ఇప్పటివరకు ఇచ్చిన అప్పులను కూడా తిరిగి చెల్లించాలంటూ ఒత్తిడి తీసుకు రావడం మొదలుపెట్టాయి. ఇక ప్రస్తుతం పాకిస్తాన్ కు చైనా అధిక వడ్డీకి అప్పులు ఇస్తూ పాకిస్తాన్ ను పూర్తిగా చెప్పుచేతల్లో పెట్టుకుంటుంది. ఇక రోజు రోజుకు పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోతున్నప్పటికీ అటు ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రజాగ్రహానికి గురి చేస్తోంది. దీంతో పాకిస్తాన్ దేశ వ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు ప్రజలు.
అయితే పాకిస్థాన్ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇటీవల ఒక పేరడీ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.. దాదాపు మూడు నెలల నుంచి పాకిస్థాన్లో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో మునిగిపోవడంతో పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ పై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సెర్బియా లోని పాక్ ఎంబసి కార్యాలయానికి చెందిన సోషల్ మీడియా ఖాతా నుంచి ఒక సాంగ్ విడుదలైంది. దీంతో పాకిస్తాన్ ఎంబసీ నుంచి ఇలాంటి వీడియో విడుదల కావడం ఏంటి అంటూ అందరూ షాక్ అయ్యారు. కానీ ఆ తర్వాత సోషల్ మీడియా హ్యాక్ అయిందని సిరియాలోని పాక్ ఎంబసీ కార్యాలయానికి చెందిన అధికారులు తెలిపారు.