చాలామంది విదేశాలకు వెళ్లి అక్కడ చదువుకొని సెటిల్ అయ్యి ఉంటారు. మరి కొంతమంది ఉద్యోగరీత్యా విదేశాలలో సంపాదన కోసం వెళుతూ ఉంటారు. అయితే కొంతమంది ఇలా ఎంతో కష్టపడుతున్నప్పటికీ కొన్ని సందర్భాలలో జరిగిన సంఘటనల వల్ల మరణించిన వారు కూడా ఉన్నారు. అలా ఇప్పుడు తాజాగా అమెరికాలో చోటు చేసుకున్న కాల్పుల ఘటనలు తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందినటువంటి వ్యక్తి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. చికాగోలో దుండగులు కాల్పులు చేయడంతో సాయి తేజ అనే విద్యార్థి మరణించినట్లుగా సమాచారం.


అయితే సాయి తేజ ఖమ్మం గ్రామానికి రాయన్నపేటకు చెందిన విద్యార్థి నట. ఎమ్మెస్ చదవడానికి నాలుగు నెలల క్రిందట అమెరికాకు వెళ్లారట. అయితే అక్కడ ఏం జరిగింది ఎలా మరణించారనే విషయాలు ఇంకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ కాల్పులలో సాయి తేజ మరణించిన వార్త కుటుంబ సభ్యులకు తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన తమ కొడుకు భవిష్యత్తు బాగుంటుందని భావించిన సమయంలో ఇలాంటి విషాద వార్త వినవలసి వచ్చిందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.


అయితే తమ కొడుకు మృతి దేహాన్ని సైతం భారతదేశానికి తీసుకువచ్చేలా చూడాలని అక్కడ తెలుగు సంఘాలను సైతం కోరుతున్నట్లు తెలుస్తోంది. మరొకవైపు రాజన్నపేటలో సాయి తేజ ఇంటికి బంధువులు స్నేహితులు సైతం చేరుకొని మరి కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నట్లు సమాచారం.. ఇలా విదేశాలలో చాలామంది ఇండియన్స్ సైతం మరణించిన సంఘటనలు ఇప్పటికి చాలానే వింటున్నాము.. కానీ ఇలాంటి విషయాల పైన అక్కడ ప్రభుత్వాలు మాత్రం ఎలాంటి సెక్యూరిటీ లేకుండా చేస్తున్నారని తెలుగు విద్యార్థులు కూడా వాపోతున్నారు. చాలామంది విద్యార్థులు మంచి భవిష్యత్తు ఉంటుందని ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లి చాలా ఇబ్బందులకు గురవుతున్నారని కూడా ఇప్పటికే చాలామంది తెలియజేశారు. మరి రాబోయే రోజుల్లో తెలుగు విద్యార్థులందరూ కూడా ఐక్యమత్యంగా చేరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: