నిరాశ ఓటమికి ముఖ ద్వారం వంటిది... అందులో నుండి ఎంత త్వరగా బయటపడితే అంత త్వరగా విజయం మన సొంతం అవుతుంది. ఓటమి గురించి భయపడకుండా, సాధించాలనే తపనతో ముందుకు సాగితే... మన సామర్థ్యమే మనలోని బలహీనతలను అధిగమించి గెలుపుకు చేరువయ్యేలా చేస్తుంది. జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక లక్ష్యం ఉండనే ఉంటుంది. కానీ ఆ లక్షాన్ని సాధించడం అందరికీ సాధ్యం కాదు.