నిజం...ఈ ఒక్క మాటను మనము దేని తోనూ పోల్చలేము. ఈ మాటను వివరించాలంటే ఏ బాషా సరి పోదు. నిజం అనేది సృష్టిలో అనంత మైనది. దీని గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. పాత రోజుల్లో పెద్ద వారు ఒక మాట చెప్పేవారు. మీ ప్రాణం పోయినా సరే సత్యాన్నే చెప్పాలి. ఒక సారి ఆలోచించండి. ఈ ఒక్క మాటలో ఎంతటి విషయం ఉందో.