ప్రతి ఒక్కరి జీవితంలో అన్నిటికంటే ఎంతో ముఖ్యమైనది వారి సంతానం. అలాగే వారి పిల్లల భవిష్యత్తు. తల్లిదండ్రులు ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా.. అదంతా వారి పిల్లల కోసమే. అలాంటిది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడం అంటే చిన్న విషయమేమీ కాదు. పిల్లల్ని పెంపకం అంత సులభం కాదు. చిన్నప్పుడు పిల్లలు ఎలా పెరుగుతారో, ఇలాంటి బుద్ధులు వారి తల్లిదండ్రులు వారికి నేర్పుతారో...ఆ ప్రభావమే వారి జీవితంపై పడుతుంది.