ప్రతి ఒక్కరికీ జీవితంలో ఎదో ఒకటి సాధించాలని కోరిక ఉంటుంది. కానీ అందరూ సాధించలేరు. ఎందుకంటే గెలుపు అనేది ఎవరికీ ఊరికే రాదు. దానికి ఎంతో కృషి పట్టుదల ఉంటేనే అది సాధ్యం అవుతుంది. కానీ కొంత మంది ఏ విధమైన ప్రయత్నం చేయకుండానే గెలుపు కోసం ఆలోచిస్తూ ఉంటారు. పెద్ద వాళ్ళు ఒక సామెత చెబుతూ ఉంటారు. గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే...ఆ దీపం వెలుగుతూ ఉండదు.