మన జీవితంలో మనం పుట్టిన సమయం నుండి కొంత వయసు వచ్చే వరకు ఒకరి మీద ఆధారపడుతూ ఉంటాము. కానీ మనము పెద్దయ్యాక మనము ఒకరి మీద ఆధారపడడం మానెయ్యాలి. అంటే మీకు అవసరమయ్యే ప్రతి ఒక్కటీ మీరే స్వంతంగా పొందగలగాలి. చిన్న చిన్న అవసరాలకు తల్లితండ్రుల మీద ఆధారపడే ఈ రోజుల్లో వారికి ఇబ్బంది కలుగకుండా మీకు మీరే స్వతహాగా బ్రతకాలి.