జీవితం సవ్యంగా సాగాలంటే డబ్బు అవసరమే కానీ.. డబ్బు మాత్రమే జీవితం కాదు. జీవితంలో, వ్యక్తిత్వ వికాసంలో, లక్ష్యాల్లో, సంస్కృతి, విలువలు, విశ్వాసాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. ఆ తర్వాత ఆత్మ విశ్వాసం, మానవ ప్రయత్నం, సాహసం, ధైర్యం, సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం మొదలైనవి విజయాలను, వైఫల్యాలను నిర్దేశిస్తాయి. సంపద అనేది అవసరమే తప్ప... ధనమే జీవితం కాదు