మనిషన్న తర్వాత అన్ని రకాల భావోద్వేగాలను కలిగి ఉంటాడు. ప్రేమ, కోపం, ద్వేషం, జాలి ఇలా ఎన్నో రకాల భావోద్వేగాలు ప్రతి ఒక్కరిలోనూ దాగి ఉంటాయి. భావోద్వేగాలు అనబడేవి హార్మోన్ల యొక్క సంక్లిష్ట మిశ్రమం. అపస్మారక మనస్సు వల్ల కలిగే చర్యలు. సందర్భాన్ని బట్టి భావోద్వేగాలు అనేవి సహజంగా బయటకు వస్తుంటాయి.