కోటిరెడ్డి ..14 టెక్ సంస్థలను ఏర్పాటు చేసి, అందులో వచ్చే రాబడి లో ప్రతి సంవత్సరం 33 శాతాన్ని నిరుపేదలకు, వితంతువులకు, వృద్ధులకు అందించడం గమనార్హం. అంటే ప్రతి సంవత్సరం తనకు ,తన సంస్థల నుండి వచ్చే ఆదాయంలో 33 శాతాన్ని అంటే దాదాపు 500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంలో క్రౌడ్ బ్లడ్ సంస్థకు అందించడం మరో విశేషం.జిల్లా పరిషత్ హై స్కూల్, మండల పరిషత్ హై స్కూల్ లను దత్తత తీసుకొని, సుమారు 700 మంది విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించడంతో పాటు, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడం విశేషం. స్కాలర్షిప్ పేరిట ప్రతి సంవత్సరం ఎంతో మంది పిల్లలకు ఉన్నత చదువులను ఉచితంగా అందిస్తున్నారు.