ఒక మనిషిగా మనము ఏదనుకుంటే అది చేయగలము. అది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. కానీ ఆ మనిషి పెళ్ళై పిల్లలు పుట్టాక, ఒక కుటుంబం ఏర్పడిన తరువాత ప్రతిదీ తన కోసం ఆలోచించడానికి వీలు పడదు. ప్రతి ఒక్క విషయంలో కుటుంబ సభ్యులు అందరినీ దృష్టిలో పెట్టుకుని చేయాలి.