మనిషి జీవితంలో ప్రతి నిమిషం చాలా విలువైనదే. అది గుర్తించి అందుకు తగ్గట్లుగా నడుచుకునే వాడే తన జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటాడు. సమాజంలో తమకంటూ గుర్తింపు తెచ్చుకొని మన్ననలను పొందుతాడు. అలా కాకుండా సమయాన్ని గాలికి వృధా చేస్తూ, కాలయాపన చేస్తూ పోతే అదే అలవాటు అయిపోతుంది.