మీరు మిమల్ని తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరినీ నియంత్రించలేరని తెలుసుకోండి. మీరు ప్రతి పనిని ఎంతో నేర్పుగా ప్రణాళిక ప్రకారం చేసుకున్నప్పటికీ, కొన్ని సమయాలలో అవి జరగకపోవచ్చు. అంతే కాకుండా ఎందుకు ఇలా జరుగుతుందని కూడా మీరు తెలుసుకోలేరు. మీరు ఇలాంటి సమయాలలో ఓర్పుతో ఉండడం వలన మీరు మళ్ళీ దాని కోసం ప్రయత్నించే అవకాశం పొందగలరు. మీకు మీరు ఖచ్చితంగా ఉండడానికి ప్రయత్నించండి. మరియు పాజిటివ్ మైండ్ తో ముందుకు సాగండి. ఎవరైతే మిమల్ని విమర్శిస్తున్నారో వారి గురించి అస్సలు ఆలోచించకండి మరియు వారు చేసిన విమర్శలన్నీ వాస్తవం కాదని బలంగా నమ్మండి. విమర్శలు చేసిన వారి నోటిని మీ యొక్క గెలుపుతో మూయించండి. అప్పుడే అలాంటి వారు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు.
మీకు జరిగిన ఈ విమర్శల దాడిని మళ్ళీ మీ జీవితంలో వేరొకరిపై జరగకుండా వీలైనంతవరకు అడ్డుకోండి. మీతో కలిసి ఉన్న వారిని మరియు మీ సహోద్యోగులను అలాగే మీ స్నేహితులను మంచి మర్యాద ఇచ్చి, వారితో గౌరవంగా నడుచుకోండి. మీ పరువును మరియు ప్రతిష్టను రక్షించుకునే మార్గం మీరు మాత్రమే. జీవితంలో ప్రతికూలత నుండి మిమ్మల్ని దూరం చేసుకోవడం చాలా ముఖ్యం. చివరిగా మీకు మీరే ఒక రోల్ మోడల్ గా జీవించండి.