"కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది. హృదయం మీరు కోరుకునే వ్యక్తులను నిర్ణయిస్తుంది. కానీ మీ ప్రవర్తన మీ వెన్నంటే ఉండే వ్యక్తులను నిర్ణయిస్తుంది". దీనర్థం ఏమిటంటే..?? పరుగులు తీస్తున్న కాలంలో ఎవరెవరినో కలుస్తుంటాం. మన హృదయానికి నచ్చిన వారికి ఆటోమేటిక్ గా దగ్గరవుతుంటాం. కానీ మన వెంట ఎవరు నిలుస్తారు అనేది మాత్రం మన ప్రవర్తనను బట్టే ఆధారపడి ఉంటుంది. మనం నడుచుకునే పద్దతి, మన వైఖరి వారిని డిసైడ్ చేస్తుంది. ఎన్ని ఆస్తిపాస్తులు సంపాదించినా మనకోసం నిలబడే నలుగురు వ్యక్తులు లేనపుడు ఎంత సంపాదించినా వృదానే అవుతుంది.

నీకంటూ నలుగురు వ్యక్తులు లేని జీవితం వృదా అని పెద్దలు చెబుతారు. అవును అది నిజమే..ఎన్ని సిరిసంపదలు ఉన్నా మన కష్ట సుఖాలను పంచుకునే మనం అనే వ్యక్తులు లేకపోతే కోట్లాది రూపాయిలు ఉన్నా సంతోషాన్ని కలిగించలేవు.  కడు పేదరికంలో ఉన్నా మన అనుకునే వారు మన వెంట ఉండి  ప్రోత్సహిస్తే ఎంత పెద్ద సమస్య అయినా అధిగమించి విజయాన్ని అందుకోవచ్చు. కానీ  మన సంతోషాన్ని కాదు దుఃఖాన్ని కూడా  పంచుకునే తోడు ఉంటేనే అసలైన విజయం మన సొంతం అవుతుంది. కావున ఇత్రులతో మీ ప్రవర్తన ఎప్పుడూ కూడా  సౌమ్యంగా ఉండాలి. మాటల్లో నిజాయితీ, నిదానం ఉండాలి.

కుటుంబ సభ్యులైనా, సన్నిహితులు అయినా మీ ప్రవర్తనే వారి మనస్సులో మీ స్థానాన్ని నిర్ణయిస్తుంది. అందుకే మాట పొదుపు అన్నారు పెద్దలు. మనకంటే తక్కువ అయినా ఎక్కువ అయినా పెద్ద అయినా చిన్న అయినా వారితో నడుచుకునే పద్దతి, మాట్లాడే తీరు వారిలో మనపై ఒక అభిప్రాయాన్ని కలిగేలా చూస్తుంది. వీలైనంత వరకు అందరితో మంచిగా ఉండాలి. ఒకవేళ మనస్పర్ధలు వచ్చినా, ఎదుటి వారిపై కోపం వచ్చినా మాట తూల కూడదు. ఏ మాట అయినా సరే పెదవి దాటేముందు  ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: