మాములుగా ఈ సమాజంలో ఒక విజయం అన్నది ఏదైనా పెద్ద ఘన కార్యం చేస్తేనే కాదు. మనకు ఇచ్చిన ఒక బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం కూడా ఒక విజయం కిందకే వస్తుంది. అలా చూసుకుంటే బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం కూడా విజయంతో సమానమే. తల్లి తండ్రులకు తమ ఇంటి పట్ల ఎన్నో బాధ్యతలు ఉంటాయి. పిల్లలు వారి పెంపకం, ఇంటిని చక్కదిద్దడం, ఆర్దికంగా స్థిర పడటం ఇలా ఎన్నో బాధ్యతలు ఉంటాయి. అయితే వీటి నుండి తల్లితండ్రులు తప్పించుకోవాలి అనుకోరు ఎంత కష్టమైనా కుటుంబాన్ని ముందుండి నడిపిస్తారు. దాదాపు అందరు తల్లితండ్రులు ఇలాగే ఆలోచిస్తారు.

కానీ అందరూ అనుకున్న విధంగా తమ కుటుంబాన్ని నదిపించలేకపోవచ్చు. కొందరు ఇందులో సఫలం కాగా మరి కొందరు జీవితం ఎటు పోతే అటుగా పయణించక తప్పదు అన్నట్లుగా సాగుతుంటారు, కొందరు తప్పక కాలంతో సర్దుకుపోతుంటారు. అయితే ఎవరైతే అన్నిటినీ ఒక ప్రణాళిక ప్రకారం చక్కబెట్టుకుంటూ వస్తుంటారో అలాంటి వారికి కాలం కూడా సహకరిస్తుంది. కాక పోతే వేసుకున్న ప్రతి ప్రణాళిక అనుకున్నట్లుగా జరగక పోవచ్చు. కానీ ప్రణాళిక ఉండటం మంచిదే అలా ప్రణాళిక ఉండటం వలన అనుకున్నది సాధించాలనే తపన నిరంతరం కొనసాగుతుంది, నిత్యం మనకు మన లక్ష్యాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది.

అపుడే  తమ కుటుంబం కోసం తాము ఎంత కష్టమైనా, నష్టమైనా భరించి పయనాన్ని సంతోషంగా కొనసాగిస్తారు. నిజానికి తల్లితండ్రులు ఎప్పుడూ కూడా తమ కుటుంబానికి సంబంధించిన ప్రతి సమస్యను భారంగా అనుకోరు, ఎంత కష్టమైనా దాన్ని చేదించాలనే చూస్తారు. అందులోనూ అది తమ పిల్లలకు సంబందించిన విషయం అయితే మరింత అలెర్ట్ గా ఉండి త్వరగా ఆ సమస్యను పరిష్కరించేందుకు శతవిధాల ప్రయత్నిస్తారు. ఇలా తమ ఇంటి బాధ్యతలు సక్రమంగా చక్కదిద్దడం అంటే అది  గొప్ప విజయంతో సమానమే.

మరింత సమాచారం తెలుసుకోండి: