ఉదయాన్నే ఎండలో ఉండటం వలన శరీరానికి విటమిన్ డి అందుతుందన్నా సంగతి అందరికి తెలిసిందే. అయితే విటమిన్ డి మనకు పలు ఆహారాల్లోనూ లభిస్తుంది. అయితే కడుపుతో ఉన్న మహిళల్లో విటమిన్ డి స్థాయిలు ఎక్కువగా ఉంటే వారికి పుట్టబోయే పిల్లల్లో ఐక్యూ ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.