కేవలం గర్భం దాల్చినప్పుడు మాత్రమే కాకుండా డెలివరీ అయిన తర్వాత కూడా మహిళలు ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డెలివరీ అయిన తర్వాత బిడ్డ పాలు తాగుతుంది కాబట్టి బాలింతలు పోషక పదార్థాలతో కూడిన ఆహారంతో పాటు త్వరగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను తీసుకోవాలి.