మహిళలు గర్భం దాల్చిన ఆ తొమ్మిది నెలలు ఎంతో ప్రత్యేకం. అయితే మహిళలు గర్భంతో ఉన్నపుడు అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతూనే ఉంటారు. అనేక మార్లు ఎన్నో బాధలు పడాల్సి ఉంటుంది. వీటిలో గుండెల్లో మంట అనేది చాలా సాధారణమైన ఫిర్యాదు. ఇది గర్భిణీ స్త్రీలలో 17 శాతం నుండి 45 శాతం మధ్య ఉంటుంది అని వైద్యులు చెబుతున్నారు.