గర్భధారణ సమయంలో మహిళలు సరిగ్గా నిద్రలేక నానా అవస్థలు పడుతుంటారు. ఇక నిద్ర లేకపోవడంతో అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక గర్భం చివరి దశలో ఉన్నప్పుడు శిశువు గర్భం లోపల కదులుతూ ఉంటాడు. దీంతో నిద్రకు భంగం వాటిల్లుతుంది. లోపల ఉన్న బిడ్డ కదిలినప్పుడు ఆటోమెటిక్ గా నిద్ర లేస్తారు. మళ్లీ పడుకోవడానికి ట్రై చేసినా నిద్ర పట్టదు. సహజంగా గర్భిణులు మానసిక ఒత్తిడికి లోనవుతారు.