గర్భధారణ సమయంలో మహిళలు చాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే గర్భము ధరించిన స్త్రీ ఏవిధముగా ఉండాలి. గర్భము ధరించిన స్త్రీ ముఖ్యముగా ఎల్లవేళలూ ప్రశాంతముగా వుండాలి. కుటుంబ మందు ఆప్యాయత అనురాగము కలిగి వుండాలి. నీతి కథలను చదువుతూ వుండాలి. గర్భం ధరించిన స్త్రీలు నిత్యం సంతోషంగా ఉండాలి. దీంతో పుట్టబోయే శిశువు కూడా అలాగే ఉంటుంది. అయితే గర్భిణులు కంటినిండా నిద్రపోవటం ఎంతో అవసరం.