గర్భధారణ సమయంలో మొదటి మూడు నెలలు గర్భిణులు చాల జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదో ఒక్కసారి చూద్దామా. ఆకుకూరల్లో ముఖ్యంగా పాలకూరలో క్యాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. తల్లి నుండి రక్తం బిడ్డవైపుకు ప్రసరిస్తుంది కాబట్టి, ఆకు కూరలను తినడం వల్ల తల్లికి సరిపడా రక్తాన్ని ఉత్పత్తి చేస్తుంది.